విశాఖపట్నం : ఖుషీ సక్సెస్ మీట్ లో యూట్యూబ్ ఫేక్ రివ్యూలు, నకిలీ రేటింగ్స్ పై యంగ్ హీరో విజయ్ దేవరకొండ నిప్పులు చెరిగారు. కొందరు కావాలనే తమ సినిమా సక్సెస్ పై కుట్రలు చేస్తున్నారని, నకిలీ రివ్యూలు రాయిస్తున్నారని అన్నారు. కొంతమందికి డబ్బులు ఇచ్చి మరీ ఇలా చేయిస్తున్నారని అన్నారు. విశాఖపట్నంలో సోమవారంనాడు జరిగిన సక్సెస్ మీట్ లో విజయ్ మాట్లాడారు. ఫేక్ రివ్యూలను పక్కకు నెడుతూ తమ సినిమా విజయవంతంగా నడుస్తోందని, అభిమానులు ఇచ్చే ఎనర్జీ చూస్తుంటే ఇలాంటి నకిలీ రివ్యూలు ఎన్ని వచ్చినా ఏం చేయలేవని అనిపిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు కుటుంబం కోసం పనిచేయాలని అనిపించినా..ఇక నుంచి అభిమానుల కోసం పనిచేస్తుంటానని, అందరూ హ్యాపీగా ఉండాలన్నదే తన కోరికని అన్నారు. వంద కుటుంబాలను సెలెక్ట్ చేసుకుని తన సంపాదనలోని కోటి రూపాయలను ఒక్కో కుటుంబానికి లక్ష రూపాలయ చొప్పున పది రోజుల్లో అందజేస్తానని చెప్పారు. తన ఆనందాన్ని..సంపదను మీతో పంచుకోకపోతే తన జీవితం దండగ అని అన్నారు. ఖుషీ విజయంపై ఆనందంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *