హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారంనాడు రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివిధ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. సిజె గా నియమితులైన అరాధే రాయ్ పూర్ లో 1964లో జన్మించారు. గతంలో మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, కర్నాటక హైకోర్టుల్లో పనిచేశారు. లీగల్ సర్వీసెస్ అథారిటీలో సేవలందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *