అమెరికాలోని తానా సభలో రేవంత్​ రెడ్డి అవసరమైతే సీతక్కను సీఎం చేస్తానన్న వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారమే రేగుతోంది. అప్పుడే ఎన్నికలు వచ్చాయనేంతలా.. నేతల తీరు ఉంది. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ హైదరాబాద్​లో బీజేపీ సమావేశం జరిగిన అనంతరం రేవంత్​ రెడ్డి ​వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. సీతక్కను ముఖ్యమంత్రి కాదు.. మొదట సీతక్కను పీసీసీ అధ్యక్షురాలిని చేయగలరా? అంటూ రేవంత్​ రెడ్డి ఈ విషయానికి సమాధానం చెప్పాలని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ డిమాండ్​ చేశారు. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. యూసీసీ బిల్లు ఉభయ సభలో పాస్​ అయ్యాక సీఎం కేసీఆర్​ పాకిస్థాన్​ పోవాస్లిందేనని ఎద్దేవా చేశారు. ముస్లిం ఓట్లు ఎక్కడ కాంగ్రెస్​కు పడతాయనే భయం కేసీఆర్​లో మొదలైందని ఆరోపించారు. అందుకే ముస్లిం మత పెద్దలను పిలుచుకొని.. కేసీఆర్​ మీటింగ్​ పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఉమ్మడి పౌరస్శృతి బిల్లుకు బీఆర్​ఎస్​ మద్దతు ఇవ్వకున్నా.. పాస్​ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. యూసీసీ బిల్లు పాస్​ అయ్యాక కేసీఆర్​.. పాకిస్థాన్​ పారిపోతానంటే వెళ్లిపోవచ్చని బీజేపీకి ఏం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *