హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు గొప్ప మనసు చాటుకుని అందరి నోట శెబాష్ అనిపించుకుంటున్నాడు. చిన్న వయసులోనే తాను చేసే పనులతో తాతకు తగ్గ మనవడు, తండ్రి తగ్గ తనయుడు అన్న కితాబు పొందాడు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ లోని కేశవ నగర్ లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్న హిమాన్షు.. సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్‌ స్కూల్‌లా తీర్చిదిద్దాడు. ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న హిమాన్ష్ సీఏఎస్ అద్యక్షుడు గా తన ఫ్రెండ్స్ తో కలిసి ఫండ్స్ కలెక్ట్ చేసి కేశవనగర్ ప్రభుత్వ స్కూల్ ను అభివృద్ధి చేశారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *