కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్న వైయస్సార్ చివరి కోరికను నెరవేర్చడమే మనం వైయస్సార్ కు అర్పించే నిజమైన నివాళి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చూపించిన మార్గంలో.. ఆయన వేసిన బాటలో కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈనాటి సమాజానికి కావలసిన అవసరాలను ఆనాడే గుర్తించిన వైయస్సార్ పేదలకు ఇందిరమ్మ ఇల్లు, మెరుగైన వైద్యం కల్పించడానికి ఆరోగ్యశ్రీ, ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి నదీ జలాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన జల యజ్ఞం ఇలా అనేక కార్యక్రమాలు ముందు చూపుతో చేసిన మహనీయుడు డాక్టర్ వైయస్సార్ అన్నారు. చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావాలని హైదరాబాదును ఉపాధి మార్గంగా అభివృద్ధి చేసిన వైయస్సార్ హైటెక్ సిటీని మరింత అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేయడంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేసి యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు పరిశ్రమలు రావడానికి పునాదులు వేసిన దార్శనికుడు అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలని త్రిబుల్ ఐటీ ని తీసుకువచ్చిన వైయస్సార్ ఆలోచనపరంగా కలిసి నడుద్దాం అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *