హైదరాబాద్ : కాంగ్రెస్ నోట..రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రెండో రోజూ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే… నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు  నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు అని రేవంత్ ను ఉద్దేశించి బుధవారంనాడు ఉదయం ట్వీట్ చేశారు. వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు, నేడు మూడు పూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు అని దుయ్యబట్టారు. మూడు ఎకరాల రైతుకు.. మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం.. ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనిని, కాంగ్రెస్ కు ఎప్పుడూ చిన్న రైతు అంటే చిన్నచూపేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు అంటే సవతి ప్రేమ చూపే కాంగ్రెస్ కు నోట్లు తప్ప… రైతుల పాట్లు తెల్వవని అన్నారు. రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం అని హెచ్చరించారు. రైతు నిండా మునుగుడు పక్కా.. నాడు ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్, నేడు.. ఉచిత కరెంట్ కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందన్నారు. మూడు గంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలన్నారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం… మళ్లోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయం.. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం..!! అని జోడించారు. రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *