హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరోసారి టీచర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. రెండు రోజుల్లో డీఎస్సీ పేరిట అందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారంనాడు ప్రకటించారు. 6611 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి రెండు రోజుల్లో విధివిధానాలు వెల్లడిస్తామన్నారు. వీటిలో పాఠశాల విద్యలో 5089 పోస్టులు భర్తీ చేయనుండగా.. మిగతావి ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులు ఎన్ని అనే దానిపై నోటిఫికేషన్ తో స్పష్టత రానున్నది. రెండు రోజుల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *