న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రేపు, ఎల్లుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి.20 సదస్సుకు కేంద్ర ప్రభుత్వం ప్రముఖులకు ఆహ్వానాలు పలుకుతోంది. ప్రపంచ దేశాధినేతలకు శనివారంనాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు అతిథులుగా హాజరవుతారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విపక్ష నాయకుడు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఇప్పటి వరకు ఆహ్వానం పంపలేదు. ఈ విషయాన్ని ఖర్గే కార్యాలయం ధ్రువీకరించింది. దేశంలో అతిపెద్ద విపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు చీఫ్ గా వ్యవహరిస్తున్న వ్యక్తికి ఆహ్వానం పంపకపోవడం ఏంటని ఆ పార్టీ గుర్రుగా ఉంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఏ రాజకీయ పార్టీ అధినేతకు ఆహ్వానం పంపలేదని పేర్కొంటున్నాయి. అయితే మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ్ తదితరులకు ప్రభుత్వం ఈ విందుకు ఆహ్వానాలు పంపింది. అదే విధంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఈ విందు భేటీకి రావాలని ఆహ్వానాలు అందాయి. భారత్ లో ప్రముఖ వ్యాపారవేత్తలుగా వెలుగొందుతున్న ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *