న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజే దద్దరిల్లాయి. మణిపూర్ లో పలువురు దుండగలు మహిళలపై దాడి చేసి, నగ్నంగా ఊరేగించిన వైనంపై వైరల్ అయిన వీడియోపై విపక్షాలు ఒంటికాలిపై లేచాయి. బిజెపి ప్రభుత్వంపై
మండిపడ్డాయి. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మరోవైపు 32 బిల్లులను పార్లమెంట్ లో మోదించుకోవాలనుకుంటున్న ప్రభుత్వానికి సరికోత్త కూటమి ‘ఇండియా’ ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు
మణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఏ పౌరసమాజానికైనా ఇలాంటిది సిగ్గు చేటు ఘటన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *