న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను  నియమించారు. మొత్తం 10 మందిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల మాజీ అధ్యక్షులతో పాటు హిమాచల్ ప్రదేశ్‌ మాజీ అధ్యక్షుడు సురేశ్ కశ్యప్, బిహార్ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, చత్తీస్‌గఢ్ సీనియర్ నేత విష్ణుదేవ్ సాయి, పంజాబ్ మాజీ అధ్యక్షుడు అశ్విని శర్మ, జార్ఖండ్ మాజీ అధ్యక్షుడు దీపక్ ప్రకాష్, రాజస్థాన్ సీనియర్ నాయకుడు కిరోడీ లాల్ మీనా, రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియాలకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు. ఏపీ మాజీ నాయకుడు సోము వీర్రాజుకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *