చెన్నై : బిచ్చగాడు సినిమాతో ఎనలేని పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నహీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమార్తె మీరా మంగళవారంనాడు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆంటోనీకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె చెన్నైలోని ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుకుంటోంది. ఉరి వేసుకున్నమీరాను హుటాహుటిన మైలాపూర్ లోని ఆస్పత్రికి తరలించినప్పటికీ పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. మీరా మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆంటోనీ కుమార్తె మరణ వార్త తెలుసుకున్న సినీ రంగ ప్రముఖులు, రాజకీయనాయకులు, ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *