హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్ పర్సన్ గా వేద రజినీ పదవీ బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు, ఎంఎల్ఏ చంటి క్రాంతి కిరణ్, రజినీ కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు రజినీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల మరణించిన తన భర్త సాయిచంద్ ను గుర్తు చేసుకోని కన్నీరు పెట్టుకున్నారు. అంతకుముందు తన భర్త ఇదే సీటులో కూర్చొని విధులు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేసుకుని విలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *