హైదరాబాద్ : సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవం ముందుగా అనుకున్న ముహూర్తంలో కొంత మార్పు జరిగింది. తొలుత ప్రకటించిన గురువారం ఉదయం 10.28 గం.లకు బదులుగా మధ్యాహ్నం 1.04కు మార్చారు. భారీ సంఖ్యలో ఆహ్వానితులు ఉన్నట్లు సమాచారం. ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ పెద్దలతో సహా కోదండరామ్, మాజీ సిఎంలు కేసీఆర్, చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్, మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం, వీరప్ప మొయిలీ, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్య, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మేధావులు, కులసంఘాలు తదితరులకు ఆహ్వానాలు పంపించారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కాంగ్రెస్ టీమ్ గవర్నర్ తమిళిసైని కలిసింది. ఎంఎల్ఎల సంతకాలతో కూడిన లేఖను అందజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *