ఆసిఫాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు లాంఛనంగా ప్రారంభించారు. లబ్దిదారుల కుటుంబాలలోని గిరిజన మహిళల పేరుతో, 12 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ గారు స్వయంగా పట్టాలు అందించారు. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామ పంచాయతీకి చెందిన కర్పెత విమలాబాయి దంపతులు, కెరమెరి మండలం జోడెఘాట్ గ్రామ పంచాయతీకి చెందిన కాటి అన్యాబాయి దంపతులు, సిర్పూర్ (అర్బన్) మండలం పంగిడి గ్రామ పంచాయతీకి చెందిన కుమ్ర మంకూబాయి దంపతులు, తిర్యానీ మండలం ఏదులపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఏదుల ఎల్లక్క దంపతులు, వాంకిడి మండలం పాటగూడ గ్రామ పంచాయతీకి చెందిన కత్లే భగీరథ దంపతులు, జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన వనిత మగదె దంపతులు, కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన మాధవీలక్ష్మి దంపతులు, మాధవీకల్లుబాయి దంపతులు, కాగజ్ నగర్ మండలం మాలినీ గ్రామ పంచాయతీకి చెందిన సూర్పం సునీత దంపతులు, సూర్పం అనసూయ దంపతులు, కాగజ్ నగర్ ఎన్జీవోస్ కాలనీ టేకం జానూబాయి దంపతులు, ఆత్రం రాంబాయి దంపతులకు సీఎం కేసీఆర్ గారు పోడు భూముల పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, జోగు రామన్న, రాథోడ్ బాపూరావు, రేఖానాయక్, విఠల్ రెడ్డి, మాజీ ఎంపి నగేష్, జడ్పీ ఛైర్ పర్సన్ లక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస రాజు, నారదాసు, స్థానిక బిఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *