హైదరాబాద్ : భారీ వర్షాలతో హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండి పోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు దాటినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 1784.20 అడుగులకు చేరింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో  భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణ్‌పేట్, మహబూబ్ నగర్, హైదరాబాద్, మేడ్చల్‌కు ఆరెంజ్ అలర్ట్, అదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *