హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అందరి నోట శభాష్ అనిపించుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని కోనాపూర్ గ్రామంతో కేటీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. అది ఆయన నాన్నమ్మ వెంకటమ్మగారి సొంత గ్రామం కావడం విశేషం. అయితే గ్రామంలో పాఠశాల సదుపాయం అంతంతమాత్రమే ఉండడంతో స్పందించిన కేటీఆర్ అక్కడ సకల హంగులతో స్కూల్ నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తన సొంత నిధులతో అది పూర్తి చేసి స్థానిక విద్యార్థులకు అంకితం చేస్తానని హామీ ఇచ్చారు. మై స్కూల్.. మై విలేజ్ శపథాన్ని తీసుకున్నారు. చెప్పిందే తడవుగా స్కూల్ భవంతిని సర్వహంగులతో నిర్మించి తుది మెరుగులు అద్దించారు. ఇప్పుడు తుది దశ పనులు జరుగుతున్నాయి. త్వరలో దీనిని ప్రారంభించబోతున్నట్టు ట్విటర్లో ప్రకటించారు. తన నానమ్మ గుర్తుగా ఇంతకన్నా ఏం చేయగలమని పేర్కొన్నారు. మాట నిలబెట్టుకున్న కేటీఆర్ పై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *