జనగామ : పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారంనాడు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో దేవరుప్పుల మండలం కామారెడ్డి
గూడెం,గొల్లపల్లి, మన్ పహాడ్ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ హుస్సేన్, కామారెడ్డి గూడెం కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిపంపుల భాస్కర్, యువజన నాయకుడు మహమ్మద్ మేహరు(తుళ్ల)
కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ జాకీర్ మాట్లాడుతూ మంత్రి దయాకర్ రావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూసి బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. తనను నమ్మి ఎంపీటీసీగా గెలిపించిన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మంత్రి సహకారంతో అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *