బీజింగ్ : త్వరలో ఢిల్లీలో జరగనున్న 18వ జి.20 శిఖరాగ్ర సదస్సుకు ఎవరు హాజరుకాబోతున్నారన్నదానిపై చైనా స్పష్టత ఇచ్చింది. అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సదస్సుకు హాజరుకాబోవడం లేదని, ఆయన బదులు చైనా తరపున ప్రధానమంత్రి లీ కియాంగ్ హాజరవుతారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు సోమవారంనాడు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేరిట వెబ్ సైట్ లో ప్రకటన పోస్టు చేశారు. ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం ఆహ్వానం మేరకు స్టేట్ కౌన్సిల్ ప్రధాని లి కియాంగ్ హాజరవుతారు. సెప్టెంబర్ 9,10 తేదీల్లో న్యూఢిల్లీ లో జరగనున్న జి.20 సదస్సు విజయవంతం కావాలని ఆశిస్తున్నాము’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాముఖ్యత కలిగిన శిఖరాగ్ర సదస్సులో చైనా ఎప్పుడూ కీలక పాత్ర పోషించడంలో ముందుంటుందని, చైనా ఆలోచనలను జి.20 సదస్సులో ప్రధానమంత్రి కియాంగ్ ఢిల్లీ వేదికగా ఆవిష్కరిస్తారని మావో నింగ్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *