న్యూఢిల్లీ : గద్దర్ భార్య విమలకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. గద్దర్ మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని శుక్రవారంనాడు రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని గుర్తు చేసుకున్నారు. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయని మోడీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు. మీ దుఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేనని, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతున్ని కోరుకుంటున్నాని సంతాప సందేశంలో ప్రధాని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *