హైదరాబాద్ : రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలకు పోటీగా బీఆర్ఎస్ స్వేద పత్రాలను తీసుకొచ్చింది. ఆదివారంనాడు ఇక్కడి తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సైమక్య పాలనలో విధ్వంసం నుంచి పురోభివ్రుద్ధి వైపు తీసుకెళ్లామని, సంక్షోభం నుంచి తెలంగాణను సమ్రుద్ధి వైపు తీసుకెళ్లామన్నారు. కాళేశ్వరంలో మొత్తం మూడు బరాజ్ ల్లో ఒక్క మేడిగడ్డలో జరిగిన చిన్న పొరపాటును పెద్ద ఎత్తున దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. దానిపై ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ సవాల్ విసిరారు. కానీ తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా అభాసుపాలు చేయడానికి ప్రయత్నించవదదని కోరారు. మాపై కాంగ్రెస్ ప్రభుత్వం బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణకు అస్తిత్వం పాటు ఆస్తులు కూడా కూడగట్టామని అన్నారు. భారత రాష్ట్ర సమితి పాలన ఒక సువర్ణాధ్యాయమని అన్నారు. జనాభా ఆధారంగా అప్పులు అంటూ తప్పుడు లెక్కలు చూపారని కేటీఆర్ ఆక్షేపించారు. విద్యుత్ రంగాన్ని ఆకాశం ఎత్తుకు తీసుకెళ్లామన్నారు. రైతులు, పరిశ్రమలకు నాణ్యమైన కరెంట్ ను అందించామన్నారు. ఉమ్మడి రాష్ట్రం కన్నా పీక్ డిమాండ్ ను కూడా మీట్ అయ్యామన్నారు. వనరుల దోపిడీ, కరువు, తాగునీటి కొరత, ఫ్లోరోసిస్ లాంటి పేరుకుపోయిన రుగ్మతలను పారద్రోలామన్నారు. ప్రాజెక్టులు నిర్మించి భూగర్బ జలాలను పెంచామని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు జిల్లా విధ్వంసానికి గురైందని, అక్కడి నుంచి 14లక్షల మంది వలస వెళ్లిపోయారని, అలాంటి వాటికి ఫుల్ స్టాఫ్ పెట్టామని తెలిపారు. ప్రభుత్వం అప్పు రూ.3.17లక్షల కోట్లేనని చెప్పారు. దానికి విరుద్ధంగా ప్రభుత్వం 6లక్షల కోట్లని భారాస ప్రభుత్వాన్ని బదనాం చేస్తోందని దుయ్యబట్టారు. 2014లో తెలంగాణ తలసరి ాదాయం రూ.1.14లక్షలుగా ఉంటే 2023 నాటికి రూ.3.17లక్షలకు చేరిందన్నారు. ఇది తమ ప్రభుత్వం చేసిన శ్రమ ఫలితం కాదా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *