హైదరాబాద్ : రాజకీయాల్లో ఆయనది దశాబ్దాల అనుభవం.. రికార్డు స్థాయిలో ఎంఎల్ఎగా ప్రజల చేతిలో ఎన్నుకోబడ్డారు.. స్వరాష్ట్రం తెలంగాణలో మంత్రి పదవిని సాకారం చేసుకున్న వ్యక్తి.. అందులో కీలకమైన పంచాయతీ రాజ్ శాఖను దక్కించుకున్నారు.. నాయకుడి అంచనాలకు మించి తన శాఖ పనితీరును పరుగులు పెట్టిస్తున్నారు.. తద్వారా ఢిల్లీ నుంచి లెక్కలేనన్ని అవార్డులు.. రివార్డులు తెలంగాణకు సాధించిపెట్టారు. ఆయనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి పల్లెకెల్లినా.. పట్నం బాట పట్టినా.. అమెరికాకేగినా ప్రజలతో ఇట్టే కలిసిపోతారు. అందరి తలలోనాలుకలా మెదులుతారు. నియోజకవర్గ పర్యటనలకు బయలుదేరితే చాలు సాధారణ కూలీలను నవ్వుతూ పలుకరిస్తూ వారితో మమేకమవుతారు. వారికష్ట సుఖాలు తెలుసుకుంటూ కూలీలు తెచ్చుకున్న సద్ది బువ్వలోని పచ్చడి మెతుకులైన సరే ఆరగిస్తారు. గౌడన్నలు కనపడితే చాలు కళ్లు రుచి చూడక మానరు. అందులోనూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు వెతుకుతారు. బతుకమ్మ, బోనాలు ఇలా ఏ పండుగ వచ్చినా సరే గ్రామీణ మహిళలు, జనంలో కలిసిపోతారు. బతుకమ్మ, బోనాలు ఎత్తి వారిని ఉత్సాహపరుస్తారు. తాజాగా పాలకుర్తిలో జరిగిన బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి బోనమెత్తి భక్తిశ్రద్ధలను చాటారు. ఇక నియోజకవర్గంలో కార్యకర్తలకు దయాకర్ రావు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలుస్తుంటారు. నియోజకవర్గ డెవలప్మెంట్ కు అహరహం శ్రమిస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. గతంలో వర్ధన్నపేట శాసనసభ్యుడిగా పనిచేసిన ఎర్రబెల్లి ఇదే తరహాలో ప్రజల మన్ననలు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *