న్యూఢిల్లీ : భారత్ లో ఉగ్రదాడులకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాదులు ఒక్కొక్కడుగా హతమవుతున్నారు. తాజాగా 2015లో జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ కాన్వాయ్ పై దాడులకు తెగబడిన ఘటనలో ప్రధాన పాత్రసూత్రధారి, లష్కరే తోయిబా ముష్కరుడు హంజ్లా అద్నాన్ తూటాలకు బలయ్యాడు. కరాచీలో ని గుర్తు తెలియని కొందరు కాల్చి చంపారు. అద్నాన్ లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు. హఫీజ్ ముంబయి దాడుల సూత్రధారిగా ప్రపంచానికి
తెలిసిందే. అద్నాన్ దేహాన్ని అక్కడి ఆర్మీ రహస్యంగా కరాచీలోని ఓ ఆస్పత్రికి తరలించింది. డిసెంబర్ 5న కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ అద్నాన్ ను రావల్పిండిలోని ఆస్పత్రికి తరలించి తొలుత చికిత్స అందించారు. సర్జరీ కోసం
కరాచీ తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అద్నాన్ ను ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదుల భర్తీ ప్రక్రియకు నియమించారు. ఇతనికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పూర్తి అండదండలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *