జైపూర్ : రాజస్థాన్ లో ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చారు. తన భార్య బాయ్ ఫ్రెండ్ చేతిలో 33 ఏళ్ల జోగేంద్ర దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ దారుణ సంఘటన పాలిలో జరిగింది. నిందితుడిని మదన్ లాల్ గా గుర్తించారు. అంతటితో ఆగకుండా డెడ్ బాడీని ఆరు ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో పాతి పెట్టాడు. వాటిపై మామిడి మొక్కలు కూడా నాటాడు. హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడు చెప్పిన వివరాలతో హతుడి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జోగేంద్ర తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. తన కుమారుడి హత్యలో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. జోగేంద్ర భార్యతో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు మదన్ లాల్ ఒప్పుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *