న్యూఢిల్లీ
బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ బీజేపీ రాష్ర్ట శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. సోమవారంనాడు ఆయనను తన కార్యాలయంలో సంజయ్ కలిసి రాష్ర్టంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత అమిత్ షా తో సంజయ్ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలపై ఇరువురి నడుమ చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీని తెలంగాణలో ఎలా అధికారంలోకి తీసుకురావాలో కూడా తనకు సంబంధించిన అనుభవాన్ని అమిత్ షాతో బండి పంచుకున్నట్లు సమాచారం. ఇటీవల కిషన్ రెడ్డి పదవీ బాధ్యతల సందర్భంగా జరిగిన అంశాలను కూడా ఆయనతో పంచుకున్నట్లు తెలిసింది. అదే సమయంలో బండి సంజయ్ కొందరు సీనియర్ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *