న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ నెల 20 నుంచి ఆగస్టు 11వరకు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారంనాడు వెల్లడించారు. అయితే పార్లమెంట్ సమావేశాలు పాత భవంతిలోనే ప్రారంభం కానున్నాయి. సమావేశాలు జరుగుతుండగానే మధ్యలో కొత్త భవంతిలోకి మార్చాలని నిర్ణయించారు. కొత్త పార్లమెంట్ భవంతిని మే 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సుమారు నెల రోజుల పాటు జరిగే వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు 20 సిట్టింగ్స్ లలో జరగనున్నాయి. ఈ సెషన్ లో ఉమ్మడి పౌరస్మతి బిల్లును ప్రవేశపెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల భోపాల్ జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *