రాయ్ గఢ్ : మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 16 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది జాడ తెలియడం లేదు. అంతా కొండచరియల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గురువారంనాడు ఉదయాన్నే ఈ ఘటన జరిగింది. 48 కుటుంబాలు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నివసిస్తూ ఉంటాయి. అందరూ నిద్రలోనే ఉండగానే కొండచరియలు విరిగిపడడంతో మరణాల సంఖ్య పెరిగింది. ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో మిగతా వారిని కాపాడలేకపోయామని ప్రాణాలతో బయటపడ్డ వారు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే హుటాహుటీన ఘటనా స్థలికి వచ్చారు. బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 20 ఇళ్లు కొండచరియల కింద కూరుకుపోయాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *