న్యూఢిల్లీ : ఉత్తరాది వర్షాలు సామాన్యుల ప్రాణాలు బలిగొంటున్నాయి. బుధవారంనాటితో మరణాల సంఖ్య 100కుపైగా చోటు చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క హిమాచల్ ప్రదేశ్ లోనే 80 మంది చనిపోయినట్లు తెలిపారు. వారం క్రితం మొదలైన వర్షాలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 300మంది పర్యాటకులు చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ మరణాలు నమోదయ్యాయి. కొండచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్ లోనే 15 మంది దుర్మరణం చెందారు. మరోవైపు ఢిల్లీలో యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. ఆవాసాలు లేని వాళ్లు రోడ్ల పక్కన గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యమునా నది నీటి ప్రవాహం 207.49 మీటర్లకు చేరుకుంది. 1978 తర్వాత ఇంత పెద్ద భారీ వరదలు యమునా నదిని ముంచెత్తడం ఇదే మొదటిసారి అని వాతావరణ విభాగం ప్రకటించింది. మరోవైపు వరద ప్రభావిత రాష్ట్రాల ప్రజలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఎనిమిది రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలతో వేలాది రూపాయల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *