షిమ్లా : రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర భారతం జలదిగ్భందంలో చిక్కుకుంది. ముఖ్యంగా హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అతలాకుతమైంది. కొండచరియలు విరిగిపడడం, మెరుపు వరదలతో విలవిలలాడుతోంది. రహదారి వ్యవస్థ తెగిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. 10 జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వరద నీటిలో కార్లు, భారీ వాహనాలు సైతం కాగితం పడవల్లా కొట్టుకుపోతున్నాయి. భారీ చెట్లు సైతం కూకటి వేళ్లతో సహా పెకిలించుకుపోయి కుప్పకూలిపోతున్నాయి. మండి తునాగ్ బజార్ జరిగిన ఇలాంటి ఘటన స్థానికులను షాక్ కు గురిచేసింది. ఆ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రజలు మరో 24 గంటల పాటు బయటికి రావొద్దని, ఇళ్లకు పరిమితం కావాలని పిలుపునిచ్చారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కోటాగఢ్ జిల్లాలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆ కుటుంబంలోని ముగ్గురు మరణించారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా పడిపోయింది. కరెంట్ లేక ప్రజలు తిప్పలు పడుతున్నారు. సహాయక టీమ్ లు చర్యలు త్వరితగతం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *