న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది డెంగ్యూ,మలేరియా జబ్బులలాంటిందన్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు
పూర్తిగా నిర్మూలించాలని శనివారంనాడు సనాతన నిర్మూలన సదస్సులో వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. కొన్ని విషయాలను వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలి. డెంగ్యూ, దోమలు, మలేరియా లేదా కరోనా లాంటి మహమ్మారులను ఇలాంటి వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో సనాతన కూడా ఒకటని ఉదయనిధి పేర్కొన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ నేత అమిత్ మాలవీయ మండిపడ్డారు. ఈ దేశంలోని 80 శాతం ప్రజలు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారని, అలాంటి వారికి వ్యతిరేకంగా నరమేధాన్ని జరపాలని ఉదయనిధి పిలుపునిస్తున్నారా అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *