ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను మార్చబోతున్నారా..? ఆయన స్థానంలో ఇటీవల కూటమిలో చేరిన అజిత్‌ పవార్‌ కు పీఠం దక్కబోతుందా..? అంటే అధికార విపక్షాల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ప్రుథ్వీరాజ్ చౌహాన్ ఆగస్టు నాటికల్లా షిండే స్థానంలో అజిత్ పవార్ ను కూర్చోబెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని, షిండే పదవిలో ఉండేది ఇంకా ఎంతో కాలం లేదని చేసిన వ్యాఖ్యలు కలకలం రేగాయి. రానున్న లోక్ సభ ఎన్నికలకు షిండే నాయకత్వంలో వెళితే ఆయన పరిమిత ప్రభావంతో నష్టమే తప్ప లాభం చేకూరే అవకాశాలు లేవని బీజేపీ యోచిస్తోందని కూడా అన్నారు. థానే జిల్లాలో తప్ప రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి షిండే ప్రభావం అంతంతేనని, ఈ నేపథ్యంలో అజిత్ పవార్ ను సరైన చాయిస్ గా బీజేపీ భావిస్తోందని అన్నారు. చవాన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అజిత్ పవార్ ను ముఖ్యమంత్రిని చేసే ఉద్దేశం తమ అధిష్టానానికి లేదని, షిండేనే సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. మహా కూటమి నాయకుడిగా చెబుతున్నా.. ఏక్ నాథ్ షిండేనే మా ముఖ్యమంత్రి, అందులో ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *