న్యూఢిల్లీ ; వివాహాలు, విందు కార్యక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రముఖులు, వారి కుటుంబాలు విదేశాల్లో వివాహ విందు కార్యక్రమాలు(డెస్టినేషన్ వెడ్డింగ్స్) నిర్వహించడానికి బదులు సొంత గడ్డ భారత్ లోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా మన డబ్బు విదేశాలకు వెళ్లకుండా తోడ్పడిన వారవుతారని సూచించారు. ఆదివారంనాడు మన్ కీ బాత్ లో భాగంగా మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు షాపింగ్ లలో భారత్ లోనే తయారైన వస్తువులను కొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ జరుగుతోందని, ఈ నేపథ్యంలో రూ.5లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోందన్నారు. విదేశాల్లోకి వెళ్లి పెళ్లిలకు దేశంలో సంపాదించిన డబ్బును అక్కడ ఖర్చు చేయడం తనను తీవ్రంగా బాధిస్తోందని మోడీ పేర్కొన్నారు. అదే ఇక్కడ డబ్బు ఖర్చు చేసి వైభవంగా ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా ఎంతో మందికి కూడా ఉపాధి లభిస్తుందన్నారు. అలా చేయడం ద్వారా సిస్టమ్ కూడా డెవలప్ అవుతుందన్నారు. అదే సమయంలో పిల్లలకు కూడా భారతదేశం
ప్రాధాన్యతను, ఇక్కడ జరుపుకోవాల్సిన కుటుంబ ఉత్సవాల ఆవశ్యకతను నేర్పాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *