ఢిల్లీ : యమునా నది వరదలకు ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. చారిత్రక ప్రదేశాలకూ వరద తాకిడి తప్పలేదు. నిన్నటికి నిన్న ఎర్రకోట వరద ముంపులో ఉండిపోగా తాజాగా అది మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ ను కూడా తాకింది. రాజ్ ఘాట్ వరద నీటిలో మునిగిపోయింది. చారిత్రత్మాక తీర్పులకు నెలవైన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా వరద పోటు తప్పలేదు. భవనం ప్రాంగణంలోకి యమునా నది వరద నీరు చేరి పరిసరాల్లో అసౌకర్యంగా ఉంది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, స్మశానాలను కూడా మూసివేసింది. వాటర్ ప్లాంట్ లు పనిచేయక జనం అవస్థలు పడుతున్నారు. అయితే శుక్రవారంనాడు వరద నీటి ముంపు ప్రభావం తగ్గుముఖం పడుతుందని, ప్రజలకు కొంత ఊరట లభిస్తుందని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *