షిమ్లా : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఏ క్షణాన ఏ కొండ కూలుతుందో.. ఏ భవంతి కుప్పకూలుతుందో టెన్షన్ టెన్షన్. కొండచరియలు విరిగిపడిన ఘటనలో రెండు రాష్ట్రాల్లో కలిపి 66మంది దుర్మరణం చెందారు. పలు ప్రాంతాల్లో శిథిలాల్లో చిక్కుకున్న శవాలను బయటికి తీసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేశాయి. మరణాలు అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ లోనే చోటుచేసుకున్నాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే 60మంది మరణించారు. ఆగస్టు 13 నుంచి మొదలైన వానలు బీభత్సం కొనసాగిస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను కుదిపివేయనున్నాయన్న ఐఎండీ హెచ్చరిక రాష్ట్ర ప్రజలను మరింత భయపెడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *