భోపాల్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలుకు వరుస శకునాలు తప్పడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ లో మంటలు చెలరేగాయి. సోమవారంనాడు పొద్దున్నే
రాణి కమలాపతి స్టేషన్ నుంచి బయలుదేరుతుండగానే రైలులోని బ్యాటరీ బాక్స్ లో పొగలు మొదలై మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమై వాటిని ఆర్పేశారు. మంటలు చెలరేగిన బోగీలోని 20 నుంచి 22 మంది ప్రయాణికులను
మరో బోగీలోకి తరలించారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. రాణి కమలాపతి-హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోని సీ-12 కోచ్ లో ఈ ఘటన జరిగింది. దీన్ని కొంత మంది రైల్వే సిబ్బంది గుర్తించి అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *