లక్నో : మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లకు ఆకతాయిల నుంచి తిప్పలు తప్పడం లేదు. తద్వారా ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారు. తాజాగా వందే భారత్ రైలుపై ఉత్తరప్రదేశ్ లో రాళ్ల దాడి జరిగింది. ఆదివారంనాడు గోరఖ్ పూర్ నుంచి లక్నో బయలుదేరిన వందే భారత్ ట్రైన్ పై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రైలు అద్దాలు దెబ్బతిన్నాయి. బారాబంకిలోని సఫేదాబాద్ సమీపంలో ఇది చోటు చేసుకుంది. రైల్వే సుందరీకరణకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నసమయంలోనే దాడి జరగడం విస్మయానికి గురిచేసింది. ఘటనపై కంట్రోల్ రూమ్ కు ఆర్పీఎఫ్ పోలీసులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *