న్యూఢిల్లీ : మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడబిడ్డలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారంనాడు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. మా ప్రభుత్వ నిర్ణయం కోట్లాది మంది మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించడంలో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరీ ముక్యంగా నారీ శక్తికి లబ్ధి చేకూరుతుందన్నారు. వంట గ్యాస్ ధరల తగ్గింపు ద్వారా మధ్యతరగతి ఆర్థికపరమైన లబ్ధితో పాటు పర్యవరణానికి మేలు జరుగుతుందని మోడీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *