ముంబయి : రైలులో ఘోర జరిగింది. మహారాష్ట్ర లోని ముంబయి వెళ్తున్న జైపూర్-ముంబయి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టాడు. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ తో పాటు మరో ముగ్గురిని కాల్చి చంపాడు. నిందితుడిని చేతన్ కుమార్ గా గుర్తించారు. జిఆర్పీ రైల్వే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విధులు, వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎఎస్ఐ టికా రామ్ తో చేతన్ వాగ్వాదానికి దిగాడని, ఈ క్రమంలో మాటామాటా పెరిగి కాల్పులకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. సోమవారంనాడు తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో వాపి-పాల్ఘర్ నడమ ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులకు ముందు పలువురు ప్రయాణికులను టికా రామ్ అదుపులోకి తీసుకున్నాడని అధికారులు వెల్లడించారు. అనంతరం అత్యవసర అలారాన్ని మోగించి తద్వారా రైలును ఆపి పారిపోయేందుకు చేతన్ విఫలయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆర్పీఎఫ్ పోలీసులు అతన్ని అదుపులోకి తసుకున్నారు. తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో చనిపోయిన ముగ్గురు ప్రయాణికుల్లో అబ్దుల కదీర్, అస్గర్ లుగా గుర్తించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని, వారిని రైల్వే శాఖ తరపున ఆదుకుంటామని అధికారులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *