న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు దిగువసభ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘మోదీ ఇంటిపేరు’ కేసులో అనర్హత వేటుకు గురైన రాహుల్ గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల దిగువ కోర్టు తీర్పుపై స్టే విధించింది. దీంతో ఆయన తిరిగి పార్లమెంట్ సభ్యుడిగా అర్హత సాధించినట్లయింది. ఈ నేపథ్యంలో రాహుల్ తిరిగి లోక్ సభకు ఈ రోజు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వంపై ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో కూడా ఆయన పాల్గొనే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *