న్యూఢిల్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. బుధవారంనాడు లోక్ సభలో కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి వేర్వేరుగా ప్రవేశ పెట్టిన తీర్మానాలకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. అయితే అవిశ్వాసంపై చర్చ ఎప్పుడు జరిగేది స్పీకర్ త్వరలో ప్రకటించనున్నారు. మణిపూర్ లో జాతుల నడుమ జరుగుతున్న రగడ, ఇటీవల మహిళలపై జరిగిన దారుణలను నిరసిస్తూ కొద్ది రోజులుగా ఇండియా కూటమి సహా బీఆర్ఎస్ తదితర పక్షాలు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన 20వ తేదీ నుంచి ఉభయ సభల్లో ఆందోళన చేస్తూ వస్తున్నాయి. పార్లమెంట్ ప్రధాని మోడీ సమగ్ర ప్రకటనకు డిమాండ్ చేస్తున్నాయి. 50 మంది సభ్యుల మద్దతు ఉంటే సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ లెక్కలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు లోక్ సభలో 9మంది మాత్రమే సభ్యులున్నందున నిరాకరణకు గురికానుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగితే దిగువసభలో అధికార ఎన్డీఏ కూటమికి సరిపడా బలం ఉంది. 331 మంది సభ్యులు మోడీ నాయకత్వంలోని కూటమివైపు ఉన్నారు. విపక్ష ఇండియా కూటమికి కేవలం 144 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఏ లెక్కన చూసినా అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు లేవు. అయితే విపక్షాలు ఒక రకంగా తాము అనుకున్నది సాధించినట్టే. దేశాన్ని ఒక సమస్య కుదిపేస్తున్నప్పుడు ప్రభుత్వం చర్చ నుంచి తప్పించుకోకుండా విపక్షాలు ఆఖరి అస్త్రంగా అవిశ్వాసాన్ని వాడుతుంటాయి. తద్వారా దేశ ప్రజల అటెన్షన్ ను మరల్చి అవకాశాలున్నాయి. అయితే మణిపూర్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటిస్తుండగా.. తాము చెప్పిన నిబంధన ప్రకారమే అది జరగాలని, దాని ప్రకారం ఓటింగ్ నిర్వహించాలని విపక్షం పట్టుబడుతూ వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *