ఐజ్వాల్ : మణిపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కుప్ప కూలింది. ఈ ఘటనలో 17మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరికొంత మంది శిథిల్లాలో చిక్కుకున్నారు. బుధవారం ఉదయం ఐజ్వాల్ కు సమీపంలోని సాయిరంగ్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దుర్ఘటన సమయంలో అక్కడ 35 నుంచి 40 మంది పనిచేస్తున్నారు. రాజధాని ఐజ్వాల్ కు 21 కి.మీ దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 17 మంది దేహాలను బయటికి తీసుకురాగలిగామని పోలీసులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఘటనపై ప్రధానమంత్రి మోడీ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల అందిస్తామన్నారు. మిజోరం ముఖ్యమంత్రి జోరాంతంగ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విచారణ జరిపిన తర్వాతే కారణాలు వెల్లడించగలమని అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *