బుల్దానా : మహారాష్ట్ర ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు యాక్సిడెంట్, మంటలు చెలరేగిన ఘటనలో 25 మంది దుర్మరణం చెందారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదయ్యింది. ప్రమాద సమయంలో బస్సులో 33మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బుల్దానా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఎక్స్ ప్రెస్ హైవేపై దూసుకుపోతున్న బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. వెంటనే మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో నుంచి బస్సు డ్రైవర్ ప్రాణలాతో బయటపడ్డాడు. బస్సు డోర్ వైపు తిరగబడడంతో బయటకు రావడానికి బాధితులకు అవకాశం చిక్కలేదని, దిక్కు లేని పరిస్థితుల్లో అందులోని ఉండి పోవాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని స్థానిక అధికారులకు సూచించారు. మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే బుల్దానా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు. మ్రుతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *