ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. కొంత కాలంగా రాష్ర్టంలో అల్లర్ల నియంత్రణలో ఆయన విఫలమయ్యారని ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండంతో ఆయన నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. మణిపూర్ లో కుకీలు, మైతీల మధ్య చెలరేగిన ఘర్షణలో వందకుపైగా మంది మరణించారు. ఈ రోజు సాయంత్రం కల్లా సీఎం బీరేన్ సింగ్ గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రం అందజేసే అవకాశాలున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా బీరేన్ సామర్థ్యంపై అసంతప్తితో ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్వయంగా వెళ్లి పరిస్థితులను సమీక్షించినప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. రెండో రోజూ అక్కడే ఉండి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శిస్తున్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *