బెంగళూరు : కర్నాటకలో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను బుధవారంనాడిక్కడ అరెస్ట్ చేశారు. బెంగళూరులో దాడులకు పథక రచన చేస్తున్నారన్న ఆరోపణలపై ఆర్టీ నగర్ ప్రాంతంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో అనుమానిత ఉగ్రవాది జునైద్ పై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. కీలక వ్యక్తి విదేశాల్లో ఉన్నాడని, అక్కడి నుంచే అంతా ఆపరేట్ చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు సుహేల్, ఒమర్, జాహిద్, ముదాసిర్, ఫైజల్ గా గుర్తించారు. వీరంతా 25 నుంచి 35 మధ్య వయస్కులు. వీరిలో కొందరికి గతంలో నేర చరిత్ర కూడా ఉంది. ఈ ఐదుగురు అనుమానితుల నుంచి కొన్ని పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురిని ప్రశ్నిస్తుండగా పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న నజీర్ అనే ఉగ్రవాదితో వీరికి సంబంధాలు ఉన్నట్లు తేలింది. తాజా అరెస్టులను గురించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హోంమంత్రి వివరించారు. నగరంలో అలర్ట్ గా ఉండాలని, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *