న్యూఢిల్లీ  : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం తాజాగా విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో మరోసారి ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మణిపూర్ అంశంపై కేంద్రం, మోడీ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు ఆఖరి అస్త్రంగా ఈ చర్యకు పూనుకున్నాయి. ఇప్పటి వరకు భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో దిగువసభ అయిన లోక్ సభలో 27 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇవన్నీ వీగిపోగా, కొన్ని మాత్రం అసంపూర్తిగా ముగిసిపోయాయి. మరోవైపు  ప్రభుత్వాలు తీసుకొచ్చిన  విశ్వాస తీర్మానాల్లో నెగ్గక ఆయా ప్రభుత్వాలు మూడు సార్లు  పడిపోయాయి. లోక్ సభలో  198 నిబంధన కింద విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువస్తాయి. దానికి 50 మంది సభ్యలు మద్దతు ఉండాలి. అప్పుడే దానికి స్పీకర్ ఆమోద ముద్ర వేస్తారు. చర్చ  ఎప్పుడు జరగాలనేదానిపై ఆయా పార్టీలతో సంప్రదించి స్పీకర్ తేదీని నిర్ణయిస్తారు. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అత్యధికంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు తీసుకువచ్చారు. 1979లో మొరార్జీ దేశాయ్ సర్కార్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆయన రాజీనామాకు దారి తీసింది. సభలో చర్చ అసంపూర్తిగానే ముగిసింది.. ఓటింగ్ కూడా జరగలేదు. ఇక విశ్వాస తీర్మానాల విషయానికి వస్తే 1990లో వీపీ సింగ్, 1997లో హెచ్ డీ దేవెగౌడ, 1997లో ఏబీ వాజ్ పేయి ప్రభుత్వాలు బలాన్ని నిరూపించుకోలేక కూలిపోయాయి.

– 1990 నవంబర్ 7న మంత్రివర్గంలో విశ్వాస తీర్మానాన్ని వీపీ సింగ్ ప్రవేశపెట్టారు. రామమందిరం అంశంలో విభేదిస్తూ బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో తీర్మానం నెగ్గలేదు. 142 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రభుత్వం గద్దె దిగక తప్పలేదు.

– 1997 ఏప్రిల్ 11న హెచ్ డీ దేవెగౌడ ప్రభుత్వం కూడా విశ్వాస తీర్మానంలో అపజయం పాలయ్యింది. 292 మంది సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయ్యడంతో 10 నెలల ప్రభ ుత్వం కుప్పకూలిపోయింది. దేవెగౌడకు మద్దతుగా 158 మంది మాత్రమే ఓటేశారు.

– ఆ తర్వాత 1998లో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏప్రిల్ 17, 1999లో జరిగిన విశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన ఒక్క ఓటు తేడాతోనే గద్దె దిగాల్సి వచ్చింది. ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్ పేయి ప్రభుత్వ కూలిపోవడానికి కారణమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *