న్యూఢిల్లీ : మణిపూర్ లో కొద్ది రోజుల క్రితం పట్టపగలు నడిరోడ్డుపై ముగ్గురు కుకీ తెగకు చెందిన మహిళలను ఊరేగించడమే కాకుండా అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన వైనానికి సంబంధించి ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. దేశంలో మహిళల పరిస్థితి, ముఖ్యంగా అణగారిన వర్గాలపై జరుగుతున్న దాష్టీకంపై యావత్ దేశం మండిపడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఒక చిత్రం అందరినీ ఆకర్షిస్తోంది. భరతమాతను నగ్నంగా ఊరేగిస్తున్నట్టు గీసిన ఆ ఊహా చిత్రం అందరి మదిని కలిచివేస్తోంది. రక్తమోడుతున్నా వదలని దుర్మార్గం ఆ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపారు. జాతీయ జెండా పాదాల కింద నలిగిపోతున్నా ఆ దుండగులు కనికరించలేదన్న అర్థం వచ్చేలా ఉన్న ఆ చిత్రం నిమిషాల వ్యవధిలో దేశం అంతటా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాన్ని చూసిన నెటిజన్లు కేంద్రం సహా రాష్ర్ట ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. ‘షేమ్ఫుల్’ పేరిట ట్విటర్ లో ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ఈ ఘటనపై సీఎం బీరేన్ సింగ్ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని విపక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *