బెంగళూరు : జాతీయ వ్యాప్తంగా ఎన్డీఏకు వ్యతిరేకంగా జట్టు కట్టి అధికార పక్షాన్ని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించాలన్న సంకల్పంతో ఉన్న విపక్ష పార్టీలు కీలక  నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సోమవారంనాడు ఇక్కడ
జరిగిన తొలి రోజు సమావేశానికి 26 పార్టీల అధినేతలు హాజరయ్యారు. నేడు కూడా కీలక సమావేశం జరగనుంది. ఇందులో రానున్న ఎన్నికలకు రోడ్ మ్యాప్ ఆవిష్కరించే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా కూటమి నాయకత్వ బాధ్యతలు కాంగ్రెస్ మాజీ అధినేత్రి, గతంలో యూపీఏ చైర్ పర్సన్ గా పనిచేసిన సోనియా గాంధీకి అప్పగించనున్నారని ఆ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఇక బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు కీలకమైన కన్వీనర్ పదవిని కట్టబెట్టే అవకాశాలున్నాయని సమాచారం. మొదటి రోజు సమావేశానికి కీలక నేతలు సోనియా, ఖర్గే, రాహుల్, ముఖ్యమంత్రులు స్టాలిన్, నితీశ్ కుమార్, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మంగళవారంనాడు రానున్నారు. దాదాపుగా అన్ని పార్టీలు ఫ్రంట్ పేరు ఏది పెడితే బాగుంటందన్న దానిపై మాట్లాడినట్లు తెలిసింది. పేరులో తప్పకుండా ‘ఇండియా’ అన్న పదం ఉండాలని సూచించినట్లు సమాచారం. దానికి ట్యాగ్ లైన్ యునైటెడ్ వీ స్టాండ్. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు ఆ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *