న్యూఢిల్లీ : యమునా నది ప్రవాహం 60 ఏళ్ల రికార్డును తిరగరాయడం… వరదలు ఢిల్లీ మహా నగరాన్ని ముంచెత్తుతుండంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అన్నీ సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్న కేజ్రీవాల్ కేంద్రం సాయాన్ని కోరారు. యుమునా నది ఒడ్డున ఉన్న ప్రజలు ఇక ఎంతమాత్రం వారివారి ఇళ్లలో ఉండకుండా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. బోట్ క్లబ్, మోనాస్టరీ మార్కెట్, యమునా బజార్, గీతా ఘాట్, గర్హి మండ్, వజీరాబాద్, మంజూ కా టిల్ల ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *