కోల్ కతా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రాష్ర్ట వ్యాప్తంగా హింస చెలరేగింది. పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరిలో ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు, కాగా ఒకరు బీజేపీ, మరొకరు కమ్యూనిస్టు కార్యకర్త ఉన్నారు. భారీ భద్రత నడుమ ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పలు చోట్ల మూడు పార్టీల కార్యకర్తలు రెచ్చిపోయారు. కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ముర్షిదాబాద్ లో బాబర్ అలీ అనే టీఎంసీ కార్యకర్తను కొట్టి చంపారు. అదే జిల్లాలోని రెజినాగర్ లో మరో కార్యకర్త ను కత్తులతో పొడిచి చంపారు. కూచ్ బిహార్ లో మాధవ్ బిశ్వాస్ అనే బీజేపీ పోలింగ్ ఏజెంట్ ను ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఈస్ట్ బుర్ద్వాన్ జిల్లాలో రజిబుల్ హక్ అనే సీపీఎం కార్యకర్తపై దాడి చేసి ప్రాణాలు తీశారు. పలు చోట్ల గాయాలపాలైన కార్యకర్తలను చికిత్స కోసం తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *