న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నేడు కేంద్ర మంత్రుల కేబినెట్‌ సమావేశం జరగనుంది. పలువురి భవితవ్యం తేలిపోనుంది. కొందరిని మంత్రివర్గం నుంచి తొలగించి, ఎన్నికల జరగబోయే రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో తాజా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కేంద్రంలోని అత్యున్నత వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ పదవులు, కేబినెట్ కూర్పుపై వారం నుంచి కసరత్తు జరుగుతోఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చ ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధాని మోడీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి ముందే పునర్వ్యవస్థీకరణ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. శాఖల కేటాయింపుపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను ఆ బాధ్యతల నుంచి తప్పించి వారిని పార్టీ అవసరాల కోసం పంపించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిషన్‌రెడ్డిని తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. భేటీ అయినవారిలోని కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని దేశ రాజధానిలో ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ నుంచి బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి అప్పగిస్తారని సమాచారం.

అంచనాలన్నీ అనుకున్నట్టుగా జరిగితే బుధవారం లేదంటే గురువారమే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యే అవకశమున్నట్లు తెలుస్తోంది. జూలై 20న పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తాయి. పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 8 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ వర్షాకాల సమావేశాలపై చర్చించేందుకు వివిధ పార్టీలు సిద్ధమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *