పాట్నా : బీహార్ లో ఓ పాత్రికేయుడిని నలుగురు దుండగులు ఇంట్లోనే దారుణంగా కాల్చి చంపారు. అరారియా జిల్లాలోని రాణిగంజ్ లో ఈ దారుణం జరిగింది. దైనిక్ జాగరణ్ పత్రికలో పనిచేస్తున్న బిమల్ యాదవ్ ఇంటికి ఉదయాన్నే 5.30గంటలకు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. బిమల్ యాదవ్ పై తుపాకీ ఎక్కుపెట్టి శరీరంలోకి బుల్లెట్లు దించారు. దీంతో బిమల్ అక్కడికక్కడే మరణించారు. ఈ దారుణ హత్యోదంతం అరారియాలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దారి తీసింది. నితీశ్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. ఎల్జేపీ(రాంవిలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వ వైఫల్యం వల్లే జర్నలిస్టు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. పోస్టు మార్టం నిర్వహించే గది వద్ద జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు అరారియా పోలీసులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *